RBI- Agree News | అన్నదాతకు స్వీట్ న్యూస్..
RBI- Agree News | అన్నదాతకు స్వీట్ న్యూస్..
వచ్చే నెల నుంచి తాకట్టు లేకుండా రూ.2లక్షల లోన్ మంజూరు..!
భారతీయ రిజర్వ్ బ్యాంకు వెల్లడి
Hyderabad | రాష్ట్రంలోని అన్నదాతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తుల తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితిని ఏకంగా రూ.2 లక్షలకు పెంచింది. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకూ పంట రుణం తీసుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు పంటల సాగు వ్యయ భారం కాకుండా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. రోజు రోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఖర్చులు పెరుగడంతో రైతులకు రుణ పరపతి సౌకర్యం మెరుగు పరుచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ఆర్‌బీఐ తాజా నిర్ణయం వల్ల 86 శాతం మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.
తాజా నిర్ణయం మేరకు బ్యాంకులు పంట రుణాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. తాజాగా కేంద్రీయ బ్యాంకు నిర్ణయం వల్ల కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా రుణ సౌకర్యం తేలిక కావడంతోపాటు గవర్నమెంట్ మోడి ఫైడ్ ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ కింద సరసమైన వడ్డీరేట్లపై రూ.3-4 లక్షల వరకూ రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే 2004లో ఎటువంటి తాకట్టు లేకుండా రూ.10 వేల రుణం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ, క్రమంగా ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది. ఈ మేరకు కింది స్థాయిలో బ్యాంకులు మాత్రం తాకట్టు లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదు. దీనివల్ల పంటల సాగు కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చిక్కుల్లో పడుతున్నారు. అందుకే దీనిపై కేంద్ర స్పందించి రైతులకు అనుకూల నిర్ణయం తీసుకుంది.
* * *
Leave A Comment